ఈ నెల 16న ఢిల్లీ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక

ఈ నెల 16న ఢిల్లీ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక

న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక ఈ నెల 16న నిర్వహించేందుకు లెఫ్టినెంట్‌‌‌‌ గవర్నర్‌‌‌‌‌‌‌‌ వీకే సక్సేనా ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఢిల్లీ మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నికకు ఫిబ్రవరి 16న సభ నిర్వహించాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపగా, సక్సేనా అంగీకరించినట్లు వారు తెలిపారు. కాగా, మేయర్‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌, స్టాండింగ్‌‌‌‌ కమిటీ మెంబర్స్‌‌‌‌ ఎన్నికలో నామినేటెడ్​ సభ్యులకు (ఆల్డర్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌) ఓటు హక్కు కల్పించారనే కారణంతో గత నెలలో సభ మూడు సార్లు వాయిదా పడింది.

కార్పొరేషన్‌‌‌‌ ఎన్నికలు డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరగగా, మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక కోసం జనవరి 6న మొదటిసారి సమావేశమయ్యారు. ఇందులో నామినేటెడ్​సభ్యులకు ఓటు హక్కు విషయంలో బీజేపీ, ఆప్‌‌‌‌ల మధ్య వాగ్వాదం జరగడంతో సభ వాయిదా పడింది. ఇదే కారణంతో జనవరి 24న మరోసారి సభ వాయిదా వేశారు. గత సోమవారం కూడా సభ వాయిదా పడటంతో, తాజాగా కొత్త డేట్‌‌‌‌ని గవర్నర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని, బీజేపీ తీరు వల్లే మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక జరగలేదని ఆప్‌‌‌‌ ఆరోపించింది. అయితే మేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్నికను నిలిపివేయడానికి ఆప్‌‌‌‌ సాకులు చూపిస్తున్నదని  బీజేపీ ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యింది.