న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం (నవంబర్ 17) ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్) కింద రూ.7,172 కోట్లు ఇన్వెస్ట్ చేసే 17 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు కలిపి రూ.65,111 కోట్ల ఉత్పత్తి విలువను సృష్టించనున్నాయి. కీలకమైన ఎలక్ట్రానిక్స్ తయారీకి కేంద్రంగా ఇండియా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
లాంగ్ టెర్మ్ సక్సెస్ సాధించడానికి డిజైన్ టీమ్‌ల ఏర్పాటుపై , అన్ని ప్రొడక్ట్‌లలో సిక్స్ సిగ్మా క్వాలిటీ స్టాండర్డ్స్ అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిపారు. డొమెస్టిక్ సప్లయర్లతో కలిసి పనిచేయడం కీలకమని అన్నారు. ఈసీఎంఎస్ స్కీమ్ రెండో విడతలో భాగంగా తాజా అప్రూవల్స్‌ను ప్రభుత్వం ఇచ్చింది.
దీంతో ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాజెక్టులు 24కి చేరాయి. జాబిల్ సర్క్యూట్, యూనో మిందా, టీఈ కనెక్టివిటీ, ఏక్వస్ కన్జూమర్ ప్రొడక్ట్స్ వంటి సంస్థలు తాజాగా అనుమతులు పొందాయి. కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్లు, మల్టీ-లేయర్ పీసీబీలు, ఆసిలేటర్లు, ఎన్‌క్లోజర్లు వంటి విభాగాల్లోని ఈ ప్రాజెక్టులు తొమ్మిది రాష్ట్రాల్లో అమలవనున్నాయి.
