
హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల సంఖ్య: 412.
పోస్టులు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్(ఈఎం) 95, ఫిట్టర్ 130, ఎలక్ట్రీషియన్ 61, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సీఓపీఏ) 51, మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్) 3, టర్నర్ 15, వెల్డర్ 22, మెషినిస్ట్ 12, మెషినిస్ట్ (జీ) 2, పెయింటర్ 9, కార్పెంటర్ 6, ప్లంబర్ 3, మెకానిక్ డ్రాఫ్ట్స్మెన్ 3.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడులో ఎన్ సీవీటీ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 01.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: 2025 అక్టోబర్ 7 నుంచి 10 వరకు.
రిజల్ట్స్: 2025 అక్టోబర్ 15, 16.
ట్రైనింగ్ ప్రారంభం: 2025, నవంబర్ 1 నుంచి ప్రారంభం.
సెలెక్షన్ ప్రాసెస్: ఐటీఐలో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో 70 శాతం పోస్టులు ప్రభుత్వ, 30 శాతం పోస్టులు ప్రైవేట్ ఐటీఐలో చదివిన వారికి కేటాయించారు.
పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.