చంద్రగిరి అటవీ ప్రాంతంలో ఏనుగు మృతదేహం

చంద్రగిరి అటవీ ప్రాంతంలో ఏనుగు మృతదేహం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూచువారిపల్లి అటవీ ప్రాంతంలో ఏడాది వయసు గల గున్న ఏనుగు మృతదేహాన్ని కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. 

 కూచువారిపల్లెలో ఏనుగులు పంటపొలాలను ధ్వంసం చేశాయి.  20 రోజులుగా యల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో18  ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేస్తున్నాయి.అటవీ ప్రాంతాన్ని వదలి పంటపొలాలపై ఏనుగులు దారి మళ్లడంతో ... కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఏనుగు మృత దేహాన్ని గుర్తించారు.  మృతి చెందిన గున్న ఏనుగు ఆ గుంపుకు చెందినదిగా భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. తల్లి నుంచి విడిపోయి కానీ... అనారోగ్యంతో కాని మరణించి ఉండవచ్చని ఎఫ్ఆర్వో దత్తాత్రేయ తెలిపారు. 10 రోజుల క్రితం ఏనుగు మరణించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఏనుగు మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. . .