కొమురం భీం జిల్లాలో మరో రైతును తొక్కి చంపిన ఏనుగు

కొమురం భీం జిల్లాలో మరో రైతును తొక్కి చంపిన ఏనుగు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగుల సంచారం జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వనం నుంచి జనావాసాల్లోకి వచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ఏనుగులు. అసిఫాబాద్ జిల్లాలో 24 గంటల్లో ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు చనిపోవడం విషాదం నింపింది.

ఏనుగు దాడిలో 2024 ఏప్రిల్ 4 గురువారం  మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. కొమురం భీం జిల్లా పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామంలో పొలం పనులకు వెళ్తున్న రైతు కారం పోషన్నపై దాడి చేసింది ఏనుగు. దీంతో పోషన్న అక్కడిక్కడే మృతి చెందాడు. ఏనుగు దాడితో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

కాగా బుధవారం(ఏప్రిల్ 3) చింతలమానేపల్లి మండలం భూరెపెళ్లి గ్రామంలో మిరిప సాగు చేసుకుంటున్న రైతు శంకర్ పై గజరాజు దాడి చేసింది. తన భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న  టైంలో.. ఒక్కసారిగా ఏనుగు వచ్చింది. అది చూసిన  శంకర్  భార్య అరుస్తూ పరుగులు పెట్టింది. శంకర్ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చసింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

ALSO READ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు

మహారాష్ట్ర సరిహద్దు అయిన ప్రాణహిత నది దాటి ఏనుగు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. శంకరయ్య మృతిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. శంకరయ్య కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.