
- రైనాలజీ అండ్ స్కల్ బేస్ సర్జరీపై చర్చ
గచ్చిబౌలి, వెలుగు: రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్లో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘ఎలివేట్ ఈఎన్‌టీ సమ్మిట్ 2025’ రెండో ఎడిషన్‌ను శనివారం నిర్వహించారు. ‘రైనాలజీ అండ్ స్కల్ బేస్ సర్జరీ’ థీమ్‌తో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ ఈఎన్‌టీ నిపుణులు కొత్త శస్త్రచికిత్సా పద్ధతులు, అత్యాధునిక సాంకేతికతలపై చర్చించారు. డాక్టర్ ఐకోపో డల్లాన్ ‘ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచెస్’పై ఆన్లైన్ లెక్చర్ ఇచ్చారు.
మెడికవర్ డైరెక్టర్ డాక్టర్ ఏ. శరత్ రెడ్డి నిరంతర వైద్య విద్యా సంస్కృతిని పెంపొందించడం లక్ష్యమని, రోగులు దీని లబ్ధిదారులని తెలిపారు. సమ్మిట్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ సంపూర్ణా ఘోష్, రైనాలజీ, స్కల్ బేస్ సర్జరీలో తాజా విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రపంచస్థాయి వైద్య సేవలను అందిస్తామన్నారు. డాక్టర్ నారాయణ జయశంకర్, నిషిత్ జే షా, అమిత్ కేశ్రి, డి.ఎస్. దినదయాల్, ఎస్. శ్రీనివాస్ కిషోర్, శ్రీకాంత్ రెడ్డి, వంశీ కృష్ణ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.