ట్విట్టర్కు ఎలన్ మస్క్ బంపరాఫర్..

ట్విట్టర్కు ఎలన్ మస్క్ బంపరాఫర్..

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్  ట్విట్టర్ కు బంపరాఫర్ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని చెప్పారు. ఇందుకోసం 41 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ట్విట్టర్ టేకోవర్కు ఇదే బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అని ప్రకటించిన మస్క్.. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఏప్రిల్ 1 ట్రేడింగ్ ముగింపు ధర ప్రకారం 54శాతం వాటా కొనుగోలు చేస్తామని ప్రతిపాదించారు. ఎలన్ మస్క్ ప్రకటనతో ట్విట్టర్ షేర్ 18శాతం దూసుకుపోయింది. 

ఈ నెల 4న ఎలన్ మస్క్ ట్విట్టర్లో 9శాతం వాటా కొనుగోలు చేశారు. దీంతో ట్విట్టర్లో అతిపెద్ద వాటాదారుగా మారారు. అత్యధిక షేర్లు కొనుగోలు చేసినందుకు ఎలన్ మస్క్ను డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించారు. అయితే ఆయన మాత్రం బోర్డులో చేరేందుకు నిరాకరించారు. ట్విట్టర్ బోర్టులో డైరెక్టర్గా చేరితే దాన్ని టేకోవర్ చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

For more news..

వైభవంగా మధుర మీనాక్షి కళ్యాణ వేడుకలు

రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందించిన భగవంత్ మాన్