ఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా.. ఈ కారణాలు నిజమేనా లేక..?

ఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా.. ఈ కారణాలు నిజమేనా లేక..?

ఎక్స్ ఓనర్.. టెస్లా సృష్టికర్త.. స్టార్ షిప్ యజమాని ఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా పడింది.. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఇండియా పర్యటన ఉంటుందని.. ఇండియా టెస్లా కార్ల తయారీ, ఎలక్ట్రికల్ కార్ల విధివిధానాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తీరా డేట్ దగ్గర పడిన తర్వాత.. ఎలన్ మస్క్ తన ఇండియా పర్యటన వాయిదా వేసుకున్నారు. ప్రపంచ కుబేరుడితో బిగ్ డీల్స్ ఉంటాయని.. టెస్లా యూనిట్లు మా రాష్ట్రంలో పెట్టాలంటే మా రాష్ట్రంలో పెట్టాలంటూ చాలా రాష్ట్రాలు కేంద్రానికి, టెస్లా ప్రతినిధులకు లేఖలు రాశాయి. ఈ క్రమంలోనే టెస్లా కంపెనీ పర్యవేక్షణల్లో బిజీగా ఉండటం వల్ల ఇండియా రాలేకపోతున్నట్లు స్వయంగా ప్రకటించటంతో అందరూ షాక్ అయ్యారు.

ఇండియా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఏప్రిల్ 10న తన ఎక్స్ అకౌంట్ ఫోస్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం (ఏప్రిల్ 22)న ఎలన్ మాస్క్ కు భారత ప్రధాని మోదీతో భేటీ ఉంది. కానీ.. ప్రధాని మోదీతో భేటీ వాయిదా పడినట్లు ఎక్స్ వేదికగా ఎలన్ మస్క్ శనివారం తెలిపారు. కంపెనీ ఇతర పనుల కారణంగా ఇండియా విజిట్ ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అయితే భారత్ లోక్ సభ ఎన్నికలు కారణంగానే ఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా పడిందని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇండియాలో టెస్లా పెట్టుబడులపై మ‌స్క్  ప్రకటన చేస్తార‌ని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. భార‌త్‌లో సుమారు మూడు బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశాలు ఉన్నట్లు అంచ‌నా వేశారు. ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉండే.. కానీ అనూహ్యంగా వేరే కారణాల వల్ల మస్క్ ఇండియా పర్యటన వాయిదా పడింది.