స్టార్‌‌లింక్‌‌ శాటిలైట్ ఇంటర్నెట్కు పర్మిషన్ .. మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రకటన

స్టార్‌‌లింక్‌‌ శాటిలైట్ ఇంటర్నెట్కు పర్మిషన్ .. మంత్రి  జ్యోతిరాధిత్య సింధియా ప్రకటన

న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌‌లింక్ మనదేశంలో శాటిలైట్ సేవలను ప్రారంభించడానికి యూనిఫైడ్ ​లైసెన్స్ పొందిందని కేంద్రం ప్రకటించింది.  స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ఒక ఫ్రేమ్‌‌వర్క్​ను తయారు చేస్తున్నామని, త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు.  

స్టార్‌‌లింక్‌‌తో పాటు, భారతీ గ్రూప్ -మద్దతుగల యూటెల్‌‌శాట్ వన్‌‌వెబ్,  జియో ఎస్​ఈఎస్​ కూడా తమ శాట్‌‌కామ్ సేవలను ప్రారంభించడానికి స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం చూస్తున్నాయి.