ఐఏఎఫ్‌కు 60 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు.. మహీంద్రాతో జతకట్టిన ఎంబ్రేయర్!

ఐఏఎఫ్‌కు 60 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు.. మహీంద్రాతో జతకట్టిన ఎంబ్రేయర్!
  • అదానీతో సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహీంద్రాతో మిలిటరీ విమానాల తయారీ 
  • బ్రెజిల్ కంపెనీ ఎంబ్రేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ (ఐఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేపట్టనున్న 60 మల్టీ -రోల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం  మహీంద్రా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  బ్రెజిలియన్ ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రేయర్ జత కట్టింది. ఈ భారీ ప్రాజెక్టులో తమ అత్యాధునిక కేసీ-390 మిలీనియం కార్గో జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆఫర్ చేస్తున్నామని ఎంబ్రేయర్ డిఫెన్స్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ సీఈఓ బోస్కోడా కోస్టా జూనియర్  వెల్లడించారు.  మిలిటరీ రంగంలో రవాణా విమానాల కోసం మహీంద్రాతోనే కొనసాగుతామని,  సివిలియన్ విమాన రంగంలో రీజినల్ కనెక్టివిటీ కోసం అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జట్టుకట్టామని ఆయన స్పష్టం చేశారు.  

ఐఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న పాత ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-32 కార్గో విమానాల స్థానాన్ని భర్తీ చేయడానికి ట్విన్- ఇంజిన్ కేసీ-390 సరిగ్గా సరిపోతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్ట్ గెలిస్తే  అదనంగా 50శాతం విమానాలను కూడా సరఫరా చేసే అవకాశం దక్కుతుంది. టాటా-లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీడ్ మార్టిన్ అందిస్తున్న అమెరికన్ సీ-130జే కంటే కేసీ-390 వేగంగా, ఎక్కువ ఎత్తులో ప్రయాణించగలదని, ఎక్కువ బరువును మోయగలదని బోస్కోడా చెప్పారు. ఎంబ్రేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లు పెరుగుతుండడంతో తమ గ్లోబల్ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైన్, - మెయింటెనెన్స్ అండ్ రిపేర్(ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ) నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కీలక వ్యూహాత్మక కేంద్రంగా మార్చాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.