టెక్నాలజీ : మొబైల్​ లో ఎమర్జెన్సీ అలర్ట్​ ఆన్ చేశారా?

టెక్నాలజీ : మొబైల్​ లో ఎమర్జెన్సీ అలర్ట్​ ఆన్ చేశారా?

భారత్​ అత్యవసర హెచ్చరికల కోసం ఎస్​ఎంఎస్ లేదా నార్మల్ మొబైల్ నోటిఫికేషన్లలా కాకుండా ఎమర్జెన్సీ అలర్ట్ డిఫరెంట్​గా ఉంటుంది. ఎమర్జెన్సీ అలర్ట్ ఆన్​ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొబైల్ స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది. ఫోన్ సైలెంట్​ మోడ్​, డిస్టర్బ్ మోడ్​లలో ఉన్నా అలర్ట్​ పెద్ద సౌండ్​తో లేదా సైరన్​లా వినిపిస్తుంది. ఉగ్రదాడి, వరదలు, భూకంపం వంటి సమయాల్లో ప్రజల్ని అలర్ట్ చేస్తుంది. కొన్ని సెకన్లలోనే లక్షల మందికి అన్ని భాషల్లో అలర్ట్ నోటిఫికేషన్లు వెళ్తాయి. 

ఆండ్రాయిడ్​లో.. 

సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి ‘సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ’ లేదా ‘ఎమర్జెన్సీ అలర్ట్స్’ మీద ట్యాప్ చేయాలి. అందులో ‘వైర్​లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్’ అనే ఆప్షన్​ని ఎంచుకోవాలి. అందుబాటులో ఉన్న అలర్ట్ ఆప్షన్స్ అన్నింటినీ యాక్టివేట్ చేయాలి. ఈ ఆప్షన్స్ మీ మొబైల్ మోడల్​ని బట్టి వేర్వేరు పేర్లతో ఉండొచ్చు. ఒకసారి మీ మొబైల్​లో ఆప్షన్ ఎలా ఉందో సెర్చ్​ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి. 

ఐఫోన్​లో..

సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్​కి వెళ్లాలి. అందులో కిందకి స్క్రోల్ చేస్తే గవర్నమెంట్ అలర్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలర్ట్స్​, క్రిటికల్ అప్​డేట్స్ కోసం టోగుల్​  చేయాలి. 

డాన్స్​ ఆప్​ ది హిల్లరీ.. పాక్​ సైబర్​ దాడి!

ప్రస్తుతం దేశంలో సైబర్ దాడులు కూడా జరిగే ప్రమాదం ఉందని సైబర్ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడులకు గురవుతోన్న రిపోర్ట్స్ కూడా వచ్చాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు. డాన్స్​ ఆఫ్​ ది హిల్లరీ వంటి మాల్వేర్ ద్వారా వైరస్​ వ్యాపిస్తున్నట్టు తెలిపింది. ఈ వైరస్​ సీక్రెట్​గా డేటాను చోరీ చేస్తుంది. డిజిటల్ డివైజ్​లను డ్యామేజ్​ చేస్తుంది. ఈ మాల్వేర్ వాట్సాప్, ఫేస్​బుక్, ఈమెయిల్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో వీడియో లేదా డాక్యుమెంట్ రూపంలో కనిపిస్తుంది. దీన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే సైలెంట్​గా వైరస్​ను బ్యాక్​గ్రౌండ్​ ఇన్​స్టాల్ చేస్తుంది. 

►ALSO READ | డేంజరస్ యాడ్ స్కాం..నెలకు 25లక్షలఫోన్లలో విధ్వంసం..ఇండియాలోనే అత్యధికం

హ్యాకర్లకు డివైజ్​ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తుంది. దీంతో హ్యాకర్లు బ్యాంకింగ్ పాస్​వర్డ్​లు, పర్సనల్ డేటా, ప్రైవసీ ఫైల్స్ యాక్సెస్, లీక్ వంటివి చేస్తారు. డివైజ్ స్లో కావడం లేదా క్రాష్​ అవ్వడం జరుగుతుంది. ఫోన్​లు, కంప్యూటర్​లు, రిమోట్​గా కంట్రోల్ చేయగలరు. ‘taskche.exe’ అనే ఫైల్​ ఓపెన్ చేయొద్దు. అలాగే ‘.exe’ అని కనిపించే ఏ ఫైల్స్​ని ఓపెన్ చేయొద్దు.

ఇలా వ్యాపిస్తుంది

ఈ హిల్లరీ వైరస్​ వీడియో అటాచ్​మెంట్​లతో వాట్సాప్​ ఫార్వార్డ్​ చేస్తుంది. ఫేక్ జాబ్ ఇంటర్వ్యూ ఈమెయిల్స్ లేదా గవర్నమెంట్ సర్క్యులర్స్​, తప్పుడు యూఆర్​ఎల్​లతో ఫేస్​బుక్ పోస్ట్​లు, హైడ్​ చేసిన ఫైల్స్​తో టెలిగ్రామ్, ఎక్స్​ మెసేజ్​ల రూపంలో వస్తుంటాయి. ఇలాంటి ఫైల్స్​ని క్లిక్ చేస్తే హ్యాకర్ల చేతికి చిక్కినట్లే. 

మరింత జాగ్రత్త!

గుర్తుతెలియని లింక్​లు, ఫైల్స్ ఓపెన్ చేయొద్దు. సోషల్ మీడియాల్లో ‘మీడియా ఆటో డౌన్​లోడ్’ ఫీచర్​ను ఆఫ్ చేయాలి. యాంటీ వైరస్​ సాఫ్ట్​వేర్​ను ఇన్​స్టాల్ చేసి, అప్​డేట్​ చేయాలి. పాస్​వర్డ్​లు స్ట్రాంగ్​గా పెట్టుకోవాలి. అవసమైన డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్​ చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా తెలియని ఫైల్​పై క్లిక్ చేసి హ్యాకింగ్​కి గురైనట్టు గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్​ హెల్ప్​ లైన్ నెంబర్ 1930కి ఫోన్​ చేసి కంప్లయింట్ ఇవ్వాలి. 

ఆన్​లైన్​ ఆపరేన్​ ఇలా..

ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు బాధ్యతాయుతంగా ఉండాలని ఎలక్ట్రానిక్స్, ఇన్​ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్​లైన్ యూజర్లంతా చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని ఉన్నాయంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అవేంటంటే.. ఆన్​లైన్​లో సూచనలు, సలహాలు, హెల్ప్​లైన్లు, ఉపశమనం కలిగించే అఫీషియల్​ విషయాలను మాత్రమే ఇతరులతో షేర్ చేయాలి. ఏదైనా వార్తను షేర్ చేసే ముందు దాన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్​ చేసి నిజమా? కాదా తెలుసుకోవాలి. ఫేక్​ న్యూస్​లు కనిపిస్తే తక్షణమే రిపోర్ట్ చేయాలి. ఇకపోతే ట్రూప్ మూమెంట్స్ షేర్ చేయకూడదు. వెరిఫై చేయని సమాచారాన్ని ఫార్వార్డ్ చేయొద్దు. హింస, మత కలహాలు రేపే పోస్ట్​లను అవాయిడ్ చేయాలి.