వ్యాపారులకూ ఎమెర్జెన్సీ క్రెడిట్ ‌‌లైన్‌‌స్కీమ్

వ్యాపారులకూ ఎమెర్జెన్సీ క్రెడిట్ ‌‌లైన్‌‌స్కీమ్

న్యూఢిల్లీ: బిజినెస్‌‌లకే కాదు బిజినెస్ ల కోసం గతంలో లోన్ తీసుకున్న వ్యక్తులకు కూడా ఎమర్జెన్సీ క్రెడిట్‌‌లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్‌‌జీఎస్) ను అమలు చేస్తున్నామని మంత్రి నిర్మల చెప్పారు. అయితే అర్హ‌త‌లు ఉంటేనే ఈ స్కీమ్ కింద సాయం వస్తుందని చెప్పారు. పెద్ద ఇండస్ట్రీలకు, ప్రొఫెషనల్స్‌కు ఇలాంటి లోన్లు ఇస్తామని అన్నారు. ఇండస్ట్రీ డిమాండ్ మేరకు ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని ,
టర్నోవర్ విలువలను మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ఈసీఎల్‌‌జీ ఎస్ కింద రూ.ఐదు కోట్ల నుంచి రూ.పది కోట్లవరకు లోన్ తీసుకోవచ్చు. అన్ని బిజినెస్‌‌లకు వర్కింగ్ క్యాపిటల్ అందించడానికే వ్యక్తులకూ ఈసీఎల్‌‌జీఎస్ లోన్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు ప్రభుత్వ కంపెనీలే ఉంటాయ్‌ ముఖ్యమైన సెక్టారను్ల గుర్తించడానికి ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ఎంటర్‌‌ప్రైజెస్ పాలసీని ప్రకటిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌‌ప్రైజ్‌‌ల సంఖ్య నాలుగుకు తగ్గిస్తామని వెల్లడించారు. స్ట్రాటెజిక్ ‌‌సెక్టార్‌ ‌లోని కంపెనీల్లో నాలుగు ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉంటాయని ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా కూడా ఆమె తెలియజేశారు. మిగతావాటిని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే ఒక ప్రపోజల్‌‌ను కేబినెట్‌‌కు అందిస్తామని అన్నారు. ఎకానమీ తప్పకుండా కోలుకుంటుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితమైన అంచనాలను ఇవ్వలేమని నిర్మల చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..