
న్యూఢిల్లీ: విజిలెన్స్ కమిషనర్‌గా సురేశ్ ఎన్. పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. అహ్మదాబాద్‌లో ఉన్న పటేల్‌తో వీడియో కాన్ఫరెన్స్ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని హై పవర్‌కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పటేల్ పేరును రికమండ్ చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న సురేశ్ .. 2015లో ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.