
కుటుంబంలో ఎవరికైనా ఏదైనా దీర్ఘకాల వ్యాధి వచ్చిందంటే చాలు ఆయనకు ఇష్టమైన పనులు చేస్తుంటారు. ఆ వ్యక్తికి సంతోషం కలిగేలా ఇతర కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తుంటారు. ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. అయితే ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి కూతురు చేసిన పనికి నెటిజన్లకు కన్నీరు తెప్పిస్తుంది.
అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు ఓ టాటూ వేయించుకుంది. అది చూసిన తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య జరిగిన ఆహ్లాదకరమైన సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.
goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఓ వీడియో అందరి మనసుల్ని కదిలించింది. తండ్రి కోసం అతని కూతురు అల వంటి గుర్తును, అతను పుట్టిన సంవత్సరం పచ్చబొట్టు వేయించుకుంది. ఇక ఈ పోస్ట్‌లో ఆమెకు 17 సంవత్సరాల వయసు. తండ్రికి అల్జీమర్స్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆమె ఈ టాటూను క్లాస్‌లో ఉండగా డిజైన్ చేసింది. టాటూలోని ఒక అల తను, ఒక అల తండ్రి అయితే జీవితమనే ప్రయాణంలో తాము పంచుకున్న జ్ఞాపకాలకు గుర్తుగా టాటూ వేయించుకుంది. ఆ తండ్రి ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు’ అనే శీర్షికతో ఈ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పోస్ట్ చూసి చాలా ఏడుపు వచ్చింది. మీ తండ్రికి ఇచ్చిన గొప్ప బహుమతి ఇది అని.. ఎంత మంచి కూతురు.. తండ్రి ఆనందం చూస్తే కన్నీరు వస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. చాలామంది ఈ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు.