అమ్మాయిలకు ఆసరాగా నిలుస్తున్న యువతి

అమ్మాయిలకు ఆసరాగా నిలుస్తున్న యువతి

చదువు, కెరీర్‌‌‌‌‌‌‌‌, పెళ్లి.. ఇలా ఏ విషయంలోనైనా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం అమ్మాయిలకు చాలా తక్కువ. ఫ్యామిలీ, సొసైటీల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే ఇదంతా. అదే అమ్మాయిలను ఎడ్యుకేట్‌‌‌‌ చేయగలిగితే.. వాళ్లకు సరైన ఎంకరేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అందితే.. లైఫ్‌‌‌‌ను తమకు నచ్చినట్లుగా మార్చుకుంటారు. ఏది మంచో.. ఏది కాదో.. వాళ్లే తెలుసుకుంటారు. ఈ పనే చేస్తోంది ‘ఎంపవరెట్టె’. అదితి గెరా స్టార్ట్‌‌‌‌ చేసిన ఈ సంస్థ, అమ్మాయిలకు అండగా ఉంటోంది.

మధ్యప్రదేశ్‌‌‌‌కు చెందిన అదితి గెరా టెన్త్​ క్లాస్​లో ఉండగా ఒక సోషల్‌‌‌‌ వర్క్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ చేసింది. ఈ టైంలో తనలాగే టీనేజ్‌‌‌‌లో ఉన్న ఒక అమ్మాయి, పనిమనిషిగా చేయడం చూసింది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పని చేస్తున్నానని, మరికొద్ది రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నానని ఆ అమ్మాయి చెప్పింది. తన వయసే ఉన్న అమ్మాయి ఇలా చిన్న వయసులోనే పెళ్లికి సిద్ధమవడం అదితిని బాధపెట్టింది. ఆ అమ్మాయికి మరో అవకాశం లేకపోవడం వల్లే ఇలా పెళ్లి చేసుకుంటోందని అర్థం చేసుకుంది. అందుకే అమ్మాయిలు సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే..? లీడర్‌‌‌‌‌‌‌‌షిప్ క్వాలిటీస్ ఉంటే..? కెరీర్‌‌‌‌‌‌‌‌లో రాణించే స్కిల్స్‌‌‌‌ ఉంటే..? ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలుసుకుంది. ఈ ఆలోచనలోంచి పుట్టిందే ‘ఎంపవరెట్టె’.

మెంటార్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌
దాదాపు రెండేళ్లక్రితం అదితి, తన ఫ్రెండ్స్‌‌‌‌ సాయంతో ‘ఎంపవరెట్టె’ని మొదలుపెట్టింది. అప్పుడు అదితి వయసు పందొమ్మిది. ఆ టైంలో ఎలా సర్వీస్‌‌‌‌ చేయాలి అనే విషయంపై అవగాహన లేకపోయినా, తనలాంటి అమ్మాయిలకు హెల్ప్‌‌‌‌ అవ్వాలన్న ఆలోచన మాత్రం ఉండేది. కొద్ది రోజుల్లోనే పల్లెటూళ్లలో ఉండే అమ్మాయిలపై దృష్టిపెట్టింది. వాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా మెంటార్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌తోపాటు అనేక ప్రోగ్రామ్స్‌‌‌‌ డిజైన్‌‌‌‌ చేసింది.

స్కిల్స్‌‌‌‌ పెరిగేలా...
‘ఎంపవరెట్టె’ అమ్మాయిల సమస్యలపై దృష్టిపెడుతుంది. లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ క్వాలిటీస్‌‌‌‌ పెంచడం, కెరీర్‌‌‌‌‌‌‌‌కు ఉపయోగపడే స్కిల్స్ నేర్పించడం, కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచడంతోపాటు అమ్మాయిల మెంటల్‌‌‌‌హెల్త్‌‌‌‌పై కూడా అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ కలిగిస్తోంది. ఇందుకోసం ముందుగా కొంతమంది అమ్మాయిల్ని సెలక్ట్‌‌‌‌ చేసి మెంటార్స్‌‌‌‌గా తయారు చేస్తారు. ఒక మెంటార్‌‌‌‌‌‌‌‌కు, ఒక అమ్మాయిని అటాచ్‌‌‌‌ చేస్తారు. ఈ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగేలా చేస్తారు. మెంటార్‌‌‌‌‌‌‌‌, తన మెంటీని అన్ని విషయాల్లో గైడ్‌‌‌‌ చేయాలి. స్కూల్స్‌‌‌‌, కాలేజ్‌‌‌‌లకు వెళ్లి స్పెషల్‌‌‌‌ క్లాసులు ఏర్పాటు  చేస్తారు. అక్కడ అమ్మాయిల్ని సెలక్ట్‌‌‌‌ చేసి, మెంటార్స్‌‌‌‌, మెంటీగా నియమిస్తారు. చాలా మంది తమ సమస్యల్ని ఎవరితో చెప్పుకోలేరు. ఇలాంటివాళ్లకు ఈ ప్రోగ్రామ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌ చేస్తుంది. సమస్యలపై మెంటార్స్‌‌‌‌తో చర్చించి, సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. 

అమ్మాయిల శక్తి వాడుకునేలా...
‘ప్రతి అమ్మాయి తనకున్న పూర్తి శక్తిని వాడుకోవాలన్నదే మా లక్ష్యం. కొంతమందైనా తమ స్థాయికి తగ్గట్లు ఎదిగేలా చేయాలనుకుంటున్నాం. వాళ్లలో లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ క్వాలిటీస్ పెంచుతున్నాం. వాళ్ల లైఫ్‌‌‌‌కు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఎనర్జీ ఇస్తున్నాం. ఇది అమ్మాయిలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని చెప్పింది అదితి.