
- 92 శాతం మంది ఏఐను వాడుతున్నారన్న మైక్రోసాఫ్ట్‑లింక్డిన్ సర్వే
న్యూఢిల్లీ : ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు వేగంగా అలవాటు పడుతున్నారని మైక్రోసాఫ్ట్– లింక్డిన్ రిపోర్ట్ పేర్కొంది. దేశంలోని నాలెడ్జ్ వర్కర్లలో ( ఇన్‌ఫర్మేషన్‌ను హ్యాండిల్ చేసే జాబ్స్ చేస్తున్నవారు) 92 శాతం మంది ఏఐ వాడుతున్నారని వెల్లడించింది. గ్లోబల్‌గా ఈ నెంబర్ 75 శాతంగా ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలోని 91 శాతం మంది లీడర్లు (కంపెనీల్లోని టాప్ మేనేజ్‌మెంట్) కంపెనీలు ఏఐకు మారాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
తమ కంపెనీలకు ఎటువంటి ప్లాన్, విజన్ లేదని 54 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 31 దేశాల్లోని 31 వేల మంది అభిప్రాయాలను సేకరించి లింక్డిన్ ఈ సర్వేను చేసింది. ఉద్యోగులను తీసుకోవడంలో ఏఐ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని 75 శాతం మంది పేర్కొన్నారు. గ్లోబల్‌గా 66 శాతం మంది లీడర్లు ఉద్యోగులను నియమించుకోవడంలో ఏఐకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇండియాలోని 85 శాతం మంది లీడర్లు (కంపెనీల్లోని టాప్ మేనేజ్‌మెంట్) ఎక్స్‌పీరియెన్స్ తక్కువున్నా, ఏఐ స్కిల్స్ ఉంటే జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని లింక్డిన్ రిపోర్ట్ పేర్కొంది. ఏఐ టూల్స్, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్న ఆర్గనైజేషన్లు టాప్ ట్యాలెంట్‌ను ఆకర్షిస్తున్నాయని తెలిపింది.