కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టిన నేపథ్యంలో.. వారికి మధ్యంతర ఉపశమనంగా బేసిక్ సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాత పెన్షన్ స్కీమ్ మళ్లీ అమల్లో తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. అంతకుముందు తమ బేసిక్ జీతంలో 40% పెంచాలని, NPS రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు సమ్మెను విరమించేది లేదని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇయ్యాళ నిరవధిక సమ్మె చేపట్టగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్ షడక్షరి అధికారులను కలిశారు. అక్కడ అతనికి 17% పెంపు ప్రతిపాదన కాపీని ఇచ్చారు. ఈ సమావేశం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారని, అయితే సమ్మె విరమిస్తారో లేదో తర్వాత ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.