జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్: టెర్రరిస్ట్ హతం

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్: టెర్రరిస్ట్ హతం

జమ్మూకశ్మీర్ లోని బుద్గాంలో ఓ టెర్రరిస్ట్ ను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో బుద్గాంలోని క్రాల్ పోరా ఏరియాలో తెల్లవారుజామున భద్రతా బలగాలు కూంబింగ్ మొదలుపెట్టాయి. ఇదే సమయంలో ఉగ్రవాది భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు.. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయినట్టు ఆర్మీ ప్రకటించింది. ఎన్ కౌంటర్ స్పాట్ లో కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు.