
‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే’.. ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ ఒక్క డైలాగ్‌తో తమ సినిమా థీమ్‌ని చెప్పేసింది ‘ఎనిమీ’ టీమ్. విశాల్ హీరోగా, ఆర్య విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ టీజర్‌ను నిన్న రిలీజ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది టీజర్. హీరో, విలన్‌ల పాత్రల్ని చాలా ప్రత్యేకంగా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు ప్రతి ఫ్రేమ్‌లోనూ అర్థమవుతోంది. విశాల్ ఎంత పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తున్నాడో ఆర్య అంత డేంజరస్‌గా కనిపిస్తున్నాడు. ఇక వీరిద్దరూ తలపడే సీన్ అయితే హైలైట్. మృణాళినీ రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ మాళవికా అవినాష్, ప్రకాష్ రాజ్, మమతా మోహన్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లందరి పాత్రల్ని కూడా స్ట్రాంగ్‌గా మలిచినట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యింది. సెప్టెంబర్‌లో సినిమా విడుదల కానుంది.