లోన్ యాప్ వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ(22) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో తెలియకుండా లోన్ యాప్ లో రూ.10వేల రుణ తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహకులు రూ. లక్ష కట్టాలంటూ వంశీని వేధించారు. 

ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థి వంశీ.. ఈనెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తాడేపల్లిలో కృష్ణా నది వద్ద మొబైల్ ఫోన్, చెప్పులు, బైక్ కనిపించాయి. నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి పిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.