కరోనా ఎఫెక్ట్: క్రికెటర్ల వేతనాల్లో కోత

కరోనా ఎఫెక్ట్: క్రికెటర్ల వేతనాల్లో కోత

కరోనా వైరస్ వల్ల ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ECBని ఆదుకునేందుకు ఇంగ్లండ్‌ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. తమ వార్షిక వేతనాల్లో 15శాతం కోతకు అంగీకరించారు. కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్‌ జట్టు విండీస్‌తో జరిగిన సిరీస్‌తో మళ్లీ క్రికెట్‌ను పున:ప్రారంభించింది. అయితే స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించ కపోవడంతోపాటు పలు కారణాల రీత్యా ఆర్థికంగా దెబ్బతింది. కరోనా వైరస్‌ కారణంగా సుమారు 106 మిలియన్‌ల బ్రిటిష్‌ పౌండ్లు కోల్పోనుంది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ECB తెలిపింది. దీంతో పొదుపు చర్యల్లో భాగంగా 62మంది సిబ్బందిని తగ్గించుకోవడంతోపాటు ఇతర విభాగాల్లోనూ జీతాల్లో కోతలు ఉంటాయని చెప్పింది. ఇంగ్లండ్‌ పురుషుల జట్టు ఇప్పటికే 5లక్షల పౌండ్లును విరాళంగా అందజేసింది. లేటెస్టుగా వచ్చే ఏడాది కాలానికి కూడా తమ రెమ్యూనరేషన్‌లో 15శాతం కోతకు అంగీకారం తెలిపింది. ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌, మ్యాచ్‌ ఫీజులు, బోనస్‌లు కూడా తగ్గించనున్నారు. వేతనాల్లో కోతకు క్రికెటర్లు అంగీకరించడంపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఎండీ ఆష్లే గైల్స్‌ హర్షం వ్యక్తం చేశారు.