ప్రిక్వార్టర్స్​లో శ్రీకాంత్‌‌‌‌, ప్రణయ్​

ప్రిక్వార్టర్స్​లో శ్రీకాంత్‌‌‌‌, ప్రణయ్​

పారిస్‌‌‌‌ : ఇండియా షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌‌‌‌, హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌, సమీర్‌‌‌‌ వర్మ,.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీలో ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో శ్రీకాంత్​ 21–18, 21–18తో లక్ష్యసేన్‌‌‌‌పై నెగ్గాడు. మరో మ్యాచ్​లో అన్‌‌‌‌సీడ్‌‌‌‌ సమీర్‌‌‌‌ 21–15, 21–23, 22–20తో ఆరోసీడ్‌‌‌‌ గింటింగ్‌‌‌‌ (ఇండోనేసియా)కు షాకిచ్చాడు.  ప్రణయ్‌‌‌‌ 21–16, 16–21, 21–16తో లియూ డారెన్‌‌‌‌ (ఇండోనేసియా)ను ఓడించాడు.