8.25 శాతానికి వడ్డీరేటు పెంచిన EPFO.. మూడేళ్లలో ఇదే అత్యధికం

8.25 శాతానికి వడ్డీరేటు పెంచిన EPFO.. మూడేళ్లలో ఇదే అత్యధికం

ఎప్లాయీస్ ప్రావిడెంట్ పండ్ ఆర్గనైజేషన్ (EPFO) డిపాజిట్లపై వడ్డీరేటును పెంచింది. 8.15 శాతం ఉన్న వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. అంతకుముందు మార్చి 2023లో 2021-22లో ఉన్న 8.10 శాతం వడ్డీరేటును 2022-23 కి గాను 8.15 శాతానికి పెంచింది. అయితే మార్చి 2022లో EPFO 2020-21లో 8.5 శాతం ఉన్న వడ్డీరేటును 2021-22కి గాను EPF పై నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించింది. EPF వడ్డీరేటు 8 శాతంగా 1977-78  తర్వాత ఇది అతి తక్కువ. 2020-21 కి EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటును CBT మార్చి 2021లో నిర్ణయించింది. 

CBT నిర్ణయం తర్వాత 2023-24 EPF డిపాజిట్లప వడ్డీరేటు ఆమోదించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించినతర్వాత మాత్రమే EPFO వడ్డీ రేటును అందిస్తుంది. 2023-24 కోసం EPF వడ్డీరేటు EPFO ఆరు కోట్ల మంది సబ్ స్క్రైబర్ల ఖాతాల్లో జమ చేయబడుతుంది. EPFO తన చందాదారులకు 2016-17లో  8.65శాతం వడ్డీరేటును 2018-19లో 8.55 శాతం వడ్డీరేటును అందించింది. 2015-16లో అత్యధికంగా వడ్డీరేటును 8.50 శాతం అందించింది. అయితే  2019-20లో ఏడేళ్ల కనిష్ట స్థాయి 8.5 శాతానికి వడ్డీరేటును తగ్గించింది.