గంజాయి నిర్మూలను కృషి చేద్దాం : ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్

గంజాయి నిర్మూలను కృషి చేద్దాం : ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్

ఆర్మూర్, వెలుగు :- గంజాయి నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని ఈఆర్​ ఫౌండేషన్​ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్​ అన్నారు. శనివారం తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఆర్మూర్​ మున్సిపల్​ పరిధిలోని పెర్కిట్​లో ‘ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు’పై కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై  మాట్లాడారు.  యూత్​ గంజాయి మత్తుకు అలవాటు పడి ఆగమవుతున్నారన్నారు. 

. గంజాయి లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజానాట్య మండలి బృందం చేస్తున్న ప్రదర్శనలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో - సాంస్కృతిక సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ, సత్యశోధక సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు శేఖర్, రాకేశ్, నరేశ్, రాంచందర్, రాంప్రసాద్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.