ఆరు నిమిషాల్లోనే నేలమట్టమైన బోయింగ్ 737 విమానం

ఆరు నిమిషాల్లోనే నేలమట్టమైన బోయింగ్ 737 విమానం
  • పని చేయని యాంటీ  స్టాల్ ఫీచర్
  • అలారాలతో కన్ ఫ్యూజైన పైలట్లు
  • ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’లోని లోపాలే దుర్ఘటనకు కారణం
  • క్రాష్ రిపోర్టులో తేల్చిన ఇథియోపియా సర్కారు

ఆరు నిమిషాలు.. ఆరంటే ఆరు నిమిషాలు.. ఇథియోపియా విమాన ప్రమాదానికి పట్టిన టైం. మరప్పుడు ఏం జరిగింది? ఆ విషయంపైనే ఇథియోపియా సర్కార్‌‌ మ్యాక్స్‌‌ 8 విమానం క్రాష్‌ రిపోర్టులో వివరించింది. ఇదీ ఆ రిపోర్టు సారాంశం.. అడిస్‌ అబాబా నుంచి నైరోబీకి ఆ విమానం టేకాఫ్‌‌ అయింది. గాల్లోకి ఎగిరి కొన్ని సెకన్లు గడిచాయి. ఫ్లైట్ నింగిలో బాగా ఎత్తుకు వెళ్లింది. గట్టి శ్వాస తీసుకుని వదిలిన పాసింజర్లు రిలాక్సేషన్ మూడ్ లోకి జారుకుంటున్నా రు. మరో ఆరు నిమిషాల్లోజరగబోయే విషాదం గురించి వాళ్లకేం తెలుసు. అంతలో విమానంలో అలారమ్స్ బిగ్గరగా మోగడం మొదలుపెట్టాయి. అందరిలోనూ కన్ఫ్యూజన్. ఏంజరుగుతుం దో ఎవరికీ అర్థం కావడం లేదు. కొన్ని సెకన్లలోనే విమానం పైలట్ల అదుపు తప్పింది. ఎత్తు, వేగం పడిపోతున్నాయి. ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులను కంగారుపడకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్లైట్ కెప్టెన్ సీటు పక్కన ఉండే ‘స్టిక్ షేకర్’ యాక్టివేట్ అయింది. అలారం కూడా పెద్దగా శబ్దం చేస్తోంది. కానీ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ పైలట్ల మాట వినడంలేదు. విమానం ముక్కు వద్ద ఏర్పాటు చేసిన కీలక సెన్సర్ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌లో ఎర్రర్ మెసేజ్‌లు చూపుతోంది.ఇది పని చేయకపోవడం వల్ల విమానాన్ని అదుపు చేసే యాంటీ స్టాల్ ఫీచర్ పని చేయడం లేదు.

గైడ్‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ పాటించారు

దాదాపు ఆరు నెలల క్రితం ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయిర్ జెట్ కూలి 189 మంది చనిపోయారు. ఈ విమానం కూడా బోయింగ్ కు చెందిన 737మ్యాక్సే . సరిగ్గా ఇదే ఫీచర్ ఫెయిలై విమానం కుప్ప కూలిం ది. ఆ తర్వాత బోయింగ్ విపత్కర పరిస్థితుల్లో పాటించాల్సిన కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. 737 మ్యాక్స్ 8ను నడిపే ప్రతి పైలట్ వీటిని పాటించాలని సూచించింది. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ పైలట్లు కూడా వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అలారాల శబ్దాలు, ప్రయాణికుల కేకలు, కిందికి దూసుకెళ్తున్న విమానం ఆ పైలెట్ల ఏకాగ్రతను దెబ్బ తీశాయి.

ఆ ఆనందం ఎంతో సేపు లేదు

ఆపద వస్తే చేయాల్సిన ప్రాథమిక పని ఇంజిన్ ఫుల్‌‌‌‌‌‌‌‌గా యాక్సిలరేట్ చేసి ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ను పైకి లేపేందుకు ప్రయత్నించడం. కెప్టె న్, కో–పైలట్లు ఇదే చేశారు. కూలడానికి మరో 30 సెకన్లు ఉన్నాయనగా విమానం ముక్కు  తిరిగి గాల్లోకి చూసేలా చేయగలిగారు. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. విమానం మరింతగా కిందికి మళ్లింది. పరిస్థితి చేయి దాటిందని అర్థమై చివరిసారిగా భార్యబిడ్డల్ని తలుచుకున్నారు.వెంటనే ఫ్లైట్ నేలను ఢీ కొట్టింది.ముక్కలు ముక్కలైంది. మొత్తం 157 మంది(విమాన సిబ్బందితో కలిపి) చనిపోయారు.