New EV Policy: కొత్త EV పాలసీకి కేంద్రం ఆమోదం

New EV Policy: కొత్త  EV పాలసీకి కేంద్రం ఆమోదం

భారత్ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రం మార్చే లక్ష్యంతో ప్రభుత్వం శుక్రవారం EV లకోసం కొత్త పథకాన్ని ప్రకటించించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోపెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ పాలసీని రూపిందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం లో వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికను అందించడంతోపాటు మేక్ ఇన్ ఇండియా ప్ర,చారాన్ని ప్రమోట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

jకొత్త విధానం ప్రకారం.. దేశంలోని కంపెనీలు కనీసం రూ. 4,150 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ప్లాంట్లను ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇందుకోసం వారు ఎలక్ట్రిక్ వాహనాలల్లో కనీసం 25 శాతం స్థానికంగా తయారు చేసిన విడిభాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది. 

పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యం, వాణిజ్య లోటును తగ్గించడం, పర్యావరణాన్ని మెరుగు పర్చడం వంటి ఫలితాలను అందించడమే ఈ పథకం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. కొత్త EV విధానం ప్రకారం.. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలు తగ్గించబడతాయి. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి 3 సంవత్సరాలలోపు  కనీస పెట్టుబడి, తయారీ సౌకర్యాల కల్పనతో ఈ కొత్త విధానం అమలు చేయడం ద్వారా ఎలోన్ మస్క్ టెస్లా వంటి కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేస్తోంది.