జనవరి కలిసి రాలే

జనవరి కలిసి రాలే

ఈ నెలలో 68,149 మంది టెక్‌ ఉద్యోగులు ఇంటికి..

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : కొత్త సంవత్సరంలో కూడా టెక్ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నెలలో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 219 కంపెనీలు 68,149 మంది ఉద్యోగులను తీసేశాయి. మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద కంపెనీలు వేలల్లో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఈ ఒక్క నెలలోనే గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రోజుకి సగటును 3,400  మంది టెక్ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలను సేకరించే లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫై ప్రకారం,  కిందటేడాది 1,000 కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి. గ్లోబల్ ఎకానమీ రెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జారుకుంటుండడంతో కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.   ఈ ఏడాది మరిన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయి.  ఈ సంస్థ చేసిన సర్వేలో కేవలం 12 శాతం మంది ఎకనామిస్టులు మాత్రమే  హైరింగ్ పెరుగుతందని అంచనావేశారు. ఈ సర్వే ప్రకారం,  రానున్న ఏడాది కాలంలో రెసిషన్ ప్రభావం ఉంటుందని మెజార్టీ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అన్నారు. దీని బట్టి లేఆఫ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.   యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న ఇండియన్లకూ ఈ ఏడాది ఇబ్బందులు తప్పేటట్టు  లేదు.  ఐబీఎం, సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పాటిఫై వంటి పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో జాబ్స్​కు కోత పెడుతున్నాయి.

ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించిన గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు..

1. ఐబీఎం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తమ ఉద్యోగుల్లో 3,900 మందిని తీసేస్తామని ప్రకటించింది. రెసిషన్ భయాలు నెలకొనడంతో  రెవెన్యూ  తగ్గిందని ఈ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ కంపెనీ ప్రకటించింది. 
2. గూగుల్ పేరెంట్ కంపెనీ  ఆల్ఫాబెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  12,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. కంపెనీ గ్రోత్ స్లో అవ్వడంతో ఉద్యోగులను తగ్గించుకుంటామని పేర్కొంది.
3. యూఎస్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగుల్లో 10,000 మందిని జాబ్స్ నుంచి తొలగిస్తామని ప్రకటించింది. 
4. అమెజాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది. ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిగా మారడం, గతంలో ఉద్యోగులను భారీగా హైర్ చేసుకోవడం వలనే తాజాగా లేఆఫ్స్ చేపడుతున్నామని తెలిపింది.
5. మెటా తమ ఉద్యోగుల్లో 11,000 మందిని తొలగిస్తామని ప్రకటించింది.  కంపెనీ రెవెన్యూ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
6. ఇంటెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ఇందుకోసం ఉద్యోగులను తగ్గించుకుంటామంది.
7. ఉద్యోగుల్లో 13 శాతం మందిని  తిసేస్తున్నామని  సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ఇప్పటికే ప్రకటించింది. రీస్ట్రక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఈ కంపెనీ లేఆఫ్స్ చేపడుతోంది.
8. సిస్కో 673 మందిని తీసేసింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో ఇది 5 శాతానికి సమానం.

ఇండియన్ కంపెనీలు..

1. ఈ–కామర్స్ కంపెనీ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇప్పటికే 100 మంది ఉద్యోగులను తీసేసింది.  
2. కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసింగ్ కంపెనీ గోమెకానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ ఉద్యోగుల్లో 70 శాతం మందిని తీసేస్తామని ప్రకటించింది. ఫండింగ్ అందడంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో కంపెనీ లేఆఫ్స్ బాట పట్టింది. 
3. షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్ పేరెంట్ కంపెనీ మొహల్లాటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ ఉద్యోగుల్లో 20 శాతం లేదా 500 మందిని తొలగిస్తున్నామని ప్రకటించింది. 
4. స్విగ్గీ ఈ ఏడాది 350 మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని పేర్కొంది. ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతోందని  పేర్కొంది.
5. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ ఉన్న డంజో తమ ఉద్యోగుల్లో 3 శాతం మందిని తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి  ఉద్యోగులను తగ్గించుకుంటున్నామని పేర్కొంది. 
6. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ తమ ఉద్యోగుల్లో 100 మందిని తగ్గించుకుంటామని ప్రకటించింది. ఓలా130–200 మందిని తీసేసింది. 
7. ఎడ్​టెక్​ సేవలు అందించే బైజూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది మరో 5 శాతం మంది ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 50 వేలు ఉందని పేర్కొంది. వేదాంతు  ఇప్పటికే 385 మందిని తొలగించింది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అకాడమీ 350 మందిని తొలగిస్తామని పేర్కొంది. ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రో  130 మందిని తీసేసింది. ఈ కంపెనీలన్నీ గతంలో కూడా ఉద్యోగులను తీసేశాయి. మరో రౌండ్ లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్నాయి.