నా మైండ్ కూల్గా ఉన్నా.. రక్తం మరుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ

నా మైండ్ కూల్గా ఉన్నా.. రక్తం మరుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ

పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పేలిన బుల్లెట్లు 140 కోట్ల భారతీయులను తాకాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ ఘటన చూసిన తర్వాత తన రక్తం మరిగిపోయిందని చెప్పారు. ‘‘మేరా దిమాగ్ ఠండా రహతా.. లేకిన్ మేరా లహూ గరం రహతా’’ అని అన్నారు. అంటే తన మైండ్ కూల్ గా ఉన్నా.. తన రక్తం మరిగిపోతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా రీ-డెవలప్ చేసిన103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్ బికనీర్ లో వర్చువల్ గా ప్రారంభించిన మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు.  ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందకు త్రివిధ దళాలకు ప్రీ హ్యండ్ ఇచ్చామని.. కేవలం 23 నిమిషాలలోనే ఆపరేషన్ సిందూర్ పూర్తయ్యిందని ఈ సందర్భంగా చెప్పారు. 

Also Read : ఇది పాత భారత్ కాదు.. కొత్త భారత్

మోదీ రక్తం మరుగుతూ ఉందని.. మోదీ రక్తంలో ఉన్నది గరం గరం సిందూరం అనే విషయాన్ని పాక్ మరిచిపోవద్దని హెచ్చరించారు. 

స్వాతంత్ర్యం తర్వాత మళ్లీ మళ్లీ పాకిస్తాన్ భారత్ పైకి దాడికి దిగే ప్రయత్నం చేస్తోందని.. ప్రతీసారి ఓటమి రుచి చూస్తోందని అన్నారు. పహల్గాం దాడికి ముందు.. మోదీ సిద్ధంగా ఉన్నరనే విషయం పాక్ మరిచిపోయిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. 

రాజస్థాన్ లోని ఎయిర్ బేస్ ను కూల్చాలని పాక్ భావించిందని.. కానీ పాక్ కుట్రలను తిప్పికొట్టామని, డ్రోన్స్ ను కూల్చేశామని చెప్పారు. అందుకు ప్రతిగా పాక్ ఎయిర్ బేస్ లను కూల్చివేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు.