ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి

ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఉదయం 9 గంటల వరకు 35 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఒకవేళ వస్తే స్పందిస్తామని ఆయన అన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ పై గొనె ప్రకాష్ రావ్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని..  పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు.