శ్రీవారిని దర్శించుకోనున్న ఏపీ సీఎం జగన్

శ్రీవారిని దర్శించుకోనున్న ఏపీ సీఎం జగన్

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీనివాసుడు ముస్తాబయ్యాడు. శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగుతారు. రెండేళ్ల తర్వాత ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది .  

ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు . రేపు కొండపై నిర్మించిన  పరకామణి భవనాన్ని ప్రారంభించనున్నారు. పరకామణిలో హుండీ కానుకల లెక్కింపును చేపట్టనున్నారు. ఐతే కానుకుల లెక్కింపుని భక్తులు చూసేలా భవనానికి రెండు వైపులా అద్దాలు ఏర్పాటు చేశారు. 2.5 కోట్లు విలువ గల చిల్లర నాణేలు వేరు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రంతో 13 రకాల నాణేలను యంత్రం సెగ్రిగేషన్ చేయనుంది.