కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య కానుక

కొండగట్టు అంజన్నకు భద్రాద్రి రామయ్య కానుక

భద్రాచలం, వెలుగు :  కొండగట్టు అంజన్నకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కానుకను ఈవో రమాదేవి గురువారం అందజేశారు. అర్చకులతో కలిసి ఆమె కొండగట్టులో హనుమత్​ జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, శేషమాలికలు కొండగట్టు ఆలయ అర్చకులకు అందజేశారు.

 ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాలతో కొండగట్టు అర్చకులు స్వాగతం పలికారు. భద్రాచలం రామాలయంలో గురువారం స్వామికి సుప్రభాత సేవ చేసి బేడా మండపంలో నిత్య కల్యాణం నిర్వహించారు. 55 జంటలు కంకణాలు ధరించి ఈ కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.