వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్ శర్మ కన్నుమూత

వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్ శర్మ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ టీమిండియా ప్లేయర్ యశ్‌పాల్ శర్మ మృతి చెందాడు. గుండె నొప్పితో కన్నుమూసిన యశ్‌పాల్‌కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యశ్‌పాల్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌‌లో యశ్‌‌పాల్ 61 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచ కప్‌లో ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా యశ్‌పాల్ నిలిచాడు. ఓవరాల్‌గా టీమిండియా తరపున 37 టెస్టుల్లో 1,606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. ఇందులో టెస్టుల్లో 2 సెంచరీలు ఉన్నాయి. యశ్‌‌పాల్ మృతిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. యశ్‌పాల్ మృతి తనను కలచి వేసిందని.. అంపైర్‌గా, జాతీయ సెలెక్టర్‌గా ఆయన అందించిన సేవలను మర్చిపోమని అనురాగ్ ట్వీట్ చేశారు.