జడ్చర్ల వెలుగు : జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం కలకలం సృష్టించాయి. వివ రాల్లోకి వెళ్తే.. కావేరమ్మపేటకు చెందిన తల్లోజు లక్ష్మి తన ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కమలాకర్తెలిపారు.
