అర్థరైటిస్ పై అవగాహన కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్

అర్థరైటిస్ పై అవగాహన కల్పించాలి :  శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  అర్థరైటిస్ పై  ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో వరల్డ్ అర్థరైటిస్ డే సందర్బంగా ఆపరేటీవ్ అర్థోప్లాస్టిక్ కోర్స్ లైవ్ సర్జరీస్ పై జరిగిన కాన్ఫరెన్స్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.

వైద్యరంగంలో పాలమూరును నెంబర్ వన్ అయ్యేలా చూసే బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. అత్యాధునిక వైద్యానికి మనం కేరాఫ్ అడ్రస్ గా మారాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో  ఎండీ డాక్టర్ కేజీ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, డాక్టర్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ డాక్టర్ జోషి, డాక్టర్ జదీశ్వర్   పాల్గొన్నారు.

ALSO READ: పల్లెనిద్రతో సమస్యల పరిష్కారం : వాసంతి