డ్రగ్స్​ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎక్సైజ్ ఆఫీసర్లు

డ్రగ్స్​ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎక్సైజ్  ఆఫీసర్లు

కందనూలు, వెలుగు: బిజినేపల్లి మండలం వట్టెం శివారులో కోళ్ల షెడ్డులో డీఆర్ఐ ఆఫీసర్లు బుధవారం రాత్రి డ్రగ్స్​ పట్టుకోగా, ఎక్సైజ్ ఆఫీసర్లు గురువారం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక కల్లు వ్యాపారులు వట్టెం పరిసరాల్లోని పంట పొలాల్లో కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. ఆల్ఫ్రాజోలం, డైజోఫామ్​  వంటి మత్తు పదార్థాలను తీసుకువచ్చి గుట్టుగా భద్రపరిచి దందా సాగిస్తున్నారు. పక్కా సమాచారంతో డీఆర్ఐ ఆఫీసర్లు దాడులు చేశారు. 31 కేజీల ఆల్ఫాజోలం సీజ్ చేశారు. 

ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో  ఎవరున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ దందాకు ఎక్సైజ్  ఆఫీసర్లు సహకరిస్తున్నట్లు సమాచారం ఉండడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. డీఆర్ఐ దాడులపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎక్సైజ్​ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.