మరికాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్

మరికాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న విషయం తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఏడు విడతల్లో దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టితో చివరి దశకు వచ్చింది. యూపీలో ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగగా.. 14న రెండు, 20న మూడు, 23న నాలుగు, 27న ఐదు, మార్చి 5న ఆరో విడత, మార్చి 7న చివరి దశ ఎన్నికలు జరిగాయి. పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 23న పోలింగ్ నిర్వహించారు. ఇక మణిపూర్లో ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.