రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. సెంటిమెంట్ రిపీట్

రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..  సెంటిమెంట్ రిపీట్

రాజస్థాన్​లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార మార్పిడి సంప్రదాయం మరోసారి కొనసాగనుందని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీ.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపాయి.

రాజస్థాన్​లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 199 స్థానాల్లో నవంబరు 25న పోలింగ్ జరిగింది. మొత్తం 51 వేల పోలింగ్​ బూత్​ల్లో శనివారం రాత్రి 9 గంటల వరకు 70 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఆకస్మిక మృతితో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 

199 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.

100 సీట్లు గెలిచిన పార్టీదే అధికారం

దైనిక్ భాస్కర్  

బీజేపీ 98-105, కాంగ్రెస్ 85-95

ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా  

బీజేపీ 80-100, కాంగ్రెస్ 86-106

జన్ కీ బాత్  

బీజేపీ 100-122, కాంగ్రెస్ 62-85

P-MARQ   

బీజేపీ  105-125,  కాంగ్రెస్ 69-91

టైమ్స్ నౌ-ETG   

బీజేపీ 108-128,  కాంగ్రెస్ 56-72

TV 9 భరతవర్ష్ పోల్‌స్ట్రాట్  

బీజేపీ 100-110, కాంగ్రెస్ 90-100   

పీపుల్స్ పల్స్ 

బీజేపీ 95 -115, కాంగ్రెస్ 73- 95 

పోల్ స్ర్టాట్ 

బీజేపీ 100 -110, కాంగ్రెస్ 90-100 

2018లో.. కాంగ్రెస్​100, బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందాయి. బీఎస్పీ ఆరు స్థానాలు, ఇండిపెండెట్లు 13 స్థానాల్లో విజయం సాధించారు. అప్పుడు బీఎస్​పీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.