16 లేదా 17 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర : వెంకట్​రెడ్డి

16 లేదా 17 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర :  వెంకట్​రెడ్డి
  • వచ్చేది కాంగ్రెస్ సర్కారే.. నేనే ముఖ్య నేతను
  • సీఎం ఎవరైనా రుణమాఫీపైనేతొలి సంతకం
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పోయేకాలం దగ్గర పడింది
  • అందుకే మహారాష్ట్ర, ఏపీ చుట్టూ తిరుగుతుండు

యాదాద్రి, వెలుగు: కేసీఆర్ సర్కారు అవినీతిని ఎండగడుతూ ఈ నెల 16 లేదా 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో కాంగ్రెస్ లీడర్లందరూ పాల్గొంటారని చెప్పారు. శనివారం యాదాద్రి జిల్లా వలిగొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలు ఇదే విషయాన్ని చెప్తున్నాయని అన్నారు. ఏర్పాటు కాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తానే ముఖ్య నేతగా ఉంటానని చెప్పారు. సీఎం ఎవరైనా ఐదు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని, రూ.2 లక్షల రుణమాఫీపైనే తొలి సంతకం పెడతారని అన్నారు. మద్యం ద్వారానే ప్రభుత్వానికి రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తుందని, రూ.4 వేల పింఛన్​ఇవ్వడం పెద్ద లెక్క కాదని చెప్పారు.

స్టూడెంట్లను మోసం చేయడానికే గ్రూప్ 2

ఆదరబాదరగా గ్రూప్ 2 పరీక్షలను పెట్టి స్టూడెంట్స్‌‌‌‌ను మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయనే పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రూప్ 2 పోస్టులతో పాటు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయ్యారు. దీంతో టీచర్లు లేక చాలా స్కూల్స్ బంద్ అవుతున్నాయి” అని ఆరోపించారు. లిక్కర్​మీద వస్తున్న రూ.50 వేల కోట్లు, కోకాపేట, ఇతర చోట్ల అమ్మిన భూముల పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయో లెక్కలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

 ‘‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పోయేకాలం దగ్గర పడింది. అందుకే తెలంగాణను పక్కనపెట్టి.. మహారాష్ట్ర, ఏపీ చుట్టూ తిరుగుతున్నారు” అని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంట్‌‌‌‌పై అబద్ధాలు చెబుతున్నారని, ఆదివారం సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. తన తొలి ప్రాధాన్యత భువనగిరికేనని, ఆ తర్వాతే నల్గొండ అని అన్నారు. భువనగిరి సహా ఎక్కడైనా సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిని దగ్గరుండి గెలిపిస్తానని చెప్పారు.