
హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్–2023 దరఖాస్తుల గడువు పొడిగించినట్టు కన్వీనర్ శ్రీనివాసచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24లోగా ఆన్‌లైన్‌లో అప్లయ్చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు నిండాలని, ఇంటర్మీడియెట్‌లో 50 శాతం మార్కులతో పాస్ కావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలని చెప్పారు. జూన్ 1న డీఈఈ సెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.