ఫేస్ బుక్ మెసెంజర్ లో మరెన్నో ఫీచర్లు

ఫేస్ బుక్ మెసెంజర్ లో మరెన్నో ఫీచర్లు

‘ఫేస్ బుక్ మెసెంజర్’ వాడుతున్నారా? దీనితో ఎక్కువగా ఏం చేస్తుంటారు? టెక్స్ట్, పిక్చర్ మెసేజ్ లు మాత్రమే పంపిస్తారా? అయితే ఇకపై వీడియో, ఆడియో మెసేజ్ లు కూడా పంపొచ్చు. ఇలాంటి మరెన్నో ఫీచర్లు ఇలా కూడా! మెసెంజర్ లో ఉన్నాయి. వాటిని ఓ సారి ట్రై చేసి చూడండి.

వీడియో కాల్స్
టెక్స్ట్ మెసేజ్ లు పంపుకోవడానికే కాదు మెసెంజర్ తో వాయిస్, వీడియో కాల్స్​ కూడా చేసుకోవచ్చు. యాప్ లో చాట్ విం డో ఓపెన్ చేసి, కాంటా క్ట్ నంబర్ సెలెక్ట్ చేసుకుని, వీడియో కెమెరా ఐకాన్ ను ట్యాప్ చేయాలి. దీంతో వీడియో కాల్ కనెక్ట్ అవుతుంది. కావాల్సిన నెంబర్ ఎంచుకుని కాల్ బటన్ ప్రెస్ చేసి వాయిస్ కాల్స్​కూడా చేయొచ్చు. వాయిస్ మెసేజ్ రికార్డు చేసి పంపుకొనే వీలుంది.

డ్రా పి క్చర్స్
కొన్నిసార్లు సింపుల్ గా ఫొటోల్ని పోస్ట్ చేయడం నచ్చదు. ఫొటోలపై కొటేషన్స్, ఏదైనా ఫీలింగ్స్​ రాయాలనిపించొచ్చు. ఇమేజ్ పై క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ ఎంచుకుని ఫొటోని మార్చేయచ్చు. ఫొటోలు మార్చాలన్నా, ఏదైనా రాయాలన్నా దీన్ని ఎంచుకోవచ్చు.

నిక్ నేమ్స్
చాలా మంది తమ స్నేహితులను నిక్ నేమ్స్​తో పిలుస్తుంటారు . ఫోన్ కాంటాక్స్ట్ లో అలాంటి నిక్ నేమ్ లతోనే సేవ్ చేసుకుంటారు. మెసెంజర్ లో కూడా ఫ్రెండ్స్​ నెంబర్లను నిక్ నేమ్ తో సేవ్ చేసుకోవచ్చు. నిక్ నేమ్ అనే ఫీచర్
ద్వారా ఇది సాధ్యం. మెసెంజర్ లో కావాల్సిన వాళ్ల పేరుపై క్లిక్ చేస్తే, అందులో నిక్ నేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మీకు నచ్చిన పేరు సెట్ చేసుకోవచ్చు.

మనీ సెండింగ్
సమాచారం పంపేందుకే కాదు.. మనీ పంపేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. మెసెంజర్ ద్వారా స్నేహితులకు నేరుగా డబ్బు పంపొచ్చు. త్రీ డాట్స్​పై క్లిక్ చేసి ‘పేమెంట్’ ఆప్షన్ ఎంచుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు పంపొచ్చు. ఇవి ‘పేపాల్’ యాప్ కు లింకై ఉండాలి. మనీ రిసీవ్ చేసుకునే వాళ్లకు కూడా ఈ యాప్ ఉండాలి. అప్పుడే స్నేహితులకు డబ్బు పంపడం సాధ్యమవుతుంది. దీనితో ఈజీగా మనీ సెండ్ చేసుకోవచ్చు. యూపీఐ కూడా అవసరం లేదు.

షేర్ యువర్ లొకేషన్
వాట్సాప్ లోనే కాదు.. మెసెంజర్ లో కూడా మీ లొకేషన్ షేర్ చేయొచ్చు. యాప్ లో పైన కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేసి, లొకేషన్ క్లిక్ చేయాలి. అంతే కావాల్సిన వాళ్లకు లొకేషన్ షేర్ అవుతుంది. ఒకవేళ ఇలా మెసెంజర్ లో
మీ లొకేషన్ సమాచారం ఉండకూడదనుకుంటే ఫేస్ బుక్ లో ‘లొకేషన్ డేటా’ను డిలీట్ చేసుకోవచ్చు.

గ్రూప్ చాట్స్
వాట్సాప్ లో లాగే ఫేస్ బుక్ మెసెంజర్ లో కూడా గ్రూప్ క్రియేట్ చేసుకుని చాటింగ్ చేసుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొలీగ్స్​తో గ్రూప్ క్రియేట్ చేసుకుని చాట్ చేయొచ్చు. గ్రూప్ లకు వేర్వేరు పేర్లు కూడా పెట్టు కోవచ్చు. గ్రూప్ చాట్ లో ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ లు వచ్చి ఇబ్బంది కలుగుతోందనుకుంటే వాటిని ‘మ్యూట్’ చేసే సదుపాయం కూడా ఉంది. అవసరమైనప్పుడే మెసేజ్ లు చూసుకునేలా మ్యూట్ టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఎంతసేపు
మ్యూట్ చేసుకుంటే అంత సేపు మెసేజ్ లు రావు. కావాల్సిన రంగును కూడా ఎంచుకోవచ్చు. మనం ఎంచుకున్న కలర్ బ్యాక్ గ్రౌండ్ లోనే చాటింగ్ చేయొచ్చు.