
మహరాష్ట్రకు చెందిన 27ఏళ్ల మహిళ పలువురిని పెళ్లిళ్లు చేసుకొని..వారికి కారణాలు చెప్పి తప్పించుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. నాసిక్ కు చెందిన యేగేష్ అనే వ్యక్తి మహరాష్ట్ర ముకుంద్ వాడీకి చెందిన విజయ్ అమృత పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని వివాహం చేసుకున్న కొన్ని రోజులకే తన వద్ద ఉన్న విలువైన ఆస్తుల్ని దొంగతనం చేసి పారిపోయిందని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణ లో భాగంగా బాధితురాలికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలత బాధితురాలు పలువురిని పెళ్లి చేసుకొని వదిలేయడం వెనుక పెద్ద ముఠా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
బాధితురాలు విజయ్ అమృత కు పెళ్లై కొడుకు ఉన్నాడు. హాయిగా సాగిపోతున్న సంసారంలో కరోనా అనే మహమ్మారి ఆర్ధికంగా ఇబ్బందుల్లోకి నెట్టింది. తన ఉద్యోగంతో పాటు భర్త ఉద్యోగం పోయింది. ఇల్లుగడవడమే కష్టంగా మారింది. దీంతో ఓ కుట్రకు తెరలేపారు బాధితురాలి భర్త. పెళ్లిళ్లు చేసుకొని ..పెళ్లి కానుకల్ని దొంగతనం చేసి వాటిని అమ్ముకొని కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకున్నారు. భార్య కుట్ర చేస్తుంటే భర్త ఆమెకు సపోర్ట్ గా నిలిచాడు. దీంతో మూడు నెలలలో మూడు పెళ్లిళ్లు చేసుకొని పెళ్లి కానుకలు బాధితుల ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని అపహరించి చివరకు అరెస్టైంది.