ఒడిశా రైలు ప్ర‌మాద బాధితుల‌కు ధోనీ, కోహ్లీ సాయం చేశారా? ఈ వార్తల్లో నిజమెంత?

ఒడిశా రైలు ప్ర‌మాద బాధితుల‌కు ధోనీ, కోహ్లీ సాయం చేశారా? ఈ వార్తల్లో నిజమెంత?

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు దుర్ఘ‌ట‌న యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటనలో బాధితుల పట్ల కొందరు ప్రముఖులు మానవత్వం చాటుకుంటున్నారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్.. ఈ ఘటనతో అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. అయితే కొందరు ఆకతాయిలు ఈ విరాళాల పట్ల ఫేక్ వార్తలు ప్రసారం చేయడం మొదలు పెట్టారు. భారత మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ రూ.60 కోట్లు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రూ.30 కోట్లు విరాళం ఇచ్చినట్లు ఫేక్ మెసేజులు ఫార్వర్డ్ చేస్తున్నారు. 

ఒడిశా రైలు ప్రమాద బాధితుల‌కు ధోని రూ.60 కోట్లు డొనేట్ చేసిన‌ట్లు ప్రసార మాధ్యమాల్లో ఫార్వ‌ర్డ్ అవుతోన్న మెసేజ్ బోగస్ అని విచారణలో తేలింది. బాధితుల‌కు ధోనీ ఎటువంటి విరాళం ఇవ్వ‌లేద‌ని వెల్లడైంది. ఇప్పటివరకూ ఈ ప్రమాద ఘటనపై ధోని స్పందించిన దాఖలాలు కూడా లేవు. అలాగే, విరాట్ కోహ్లీ 30 కోట్లు డొనేట్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్త‌ల్లోనూ వాస్తవం లేద‌ని ఒడిశా పోలీసులు తెలిపారు. ఫేక్ ట్వీట్ల‌తో రైలు ప్ర‌మాద ఘ‌ట‌న ప‌ట్ల మ‌తం కోణాన్ని చొప్పించాలని చూస్తున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఫేక్ మెసేజ్‌ల‌ను ఎవ‌రూ ఫార్వ‌ర్డ్ చేయ‌వ‌ద్దని పోలీసులు తెలిపారు.