నకిలీ SI.. ఉద్యోగాల పేరుతో చీటింగ్

నకిలీ SI.. ఉద్యోగాల పేరుతో చీటింగ్

హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం బయటపడింది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని ఈస్ట్ జోన్  టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  వనపర్తి జిల్లాకు కడవత్ సోమ్లా నాయక్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో  డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నాయక్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యాడు. 

ఎంపికైన అతను ఆరు నెలల తర్వాత వైద్య కారణాల వల్ల శిక్షణ ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు శాఖలో ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నాయక్ విఫలమయ్యాడు. దీంతో హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2012 నుంచి సోమ్లా నాయక్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పి పోలీస్ శాఖలో చేరాలనుకునే యువతను ఆసరాగా చేసుకుని వారిని మోసం చేయడం స్టార్ట్ చేశాడు. 

తాను పోలీస్ నని ఇటు కుటుంబ సభ్యులను అటు గ్రామస్తులను అందరిని నమ్మించాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో లాభదాయకమైన పదవులు ఇప్పిస్తానని యువతను నుంచి భారీగా డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా చాలా మందిని మోసం చేసి రూ.11 లక్షల వరకు దాచిపెట్టినట్టు సమాచారం. మోసాపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు సోమ్లా నాయక్ కోసం విచారణ చేసి పట్టుకున్నారు. అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.