అభిమానే కదా అని దగ్గరకు రానిస్తే.. నడుము గిల్లేసాడు

అభిమానే కదా అని దగ్గరకు రానిస్తే.. నడుము గిల్లేసాడు

సినీ  స్టార్స్ ను చూడటానికి వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తీరా అలాంటి సమయం వచ్చేసరికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ కోపానికి  కారకులవుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే హిందీ నటి అహానా కుమ్రాకు ఎదురైంది. తాజాగా ఒక ఈవెంట్ కు అటెండ్ ఐన ఆమెతో ఒక అభిమాని ఫోటో దిగాలని ప్రయత్నించాడు. 

ఫోటో దిగుతున్న క్రమంలో అహానా నడుముపై చెయ్యి వేసాడు. దీంతో చిర్రెతుకొచ్చిన ఆమె.. డోంట్ టచ్ మీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. హీరోయిన్ విషయంలో అభిమాని చేసిన పనిని తప్పుపడుతున్నారు. 

ఇక అహానా సినిమాల విషయానికి వస్తే ఆమె.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన "యుధ్" టీవీ షోతో మంచి పేరు తెచ్చుకుంది అహానా. ఆ తరువాత వచ్చిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్. ఇండియా లాక్ డౌన్ సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.