IPL Final: RCB కి దిష్టి తగలొద్దని ఫ్యాన్స్ ఏం చేశారో చూడండి..!

IPL Final: RCB కి దిష్టి తగలొద్దని ఫ్యాన్స్ ఏం చేశారో చూడండి..!

ఐపీఎల్ ఫైనల్ వేళ ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. అన్ని పనులు మానుకుని ఉదయం నుంచి ఫైనల్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొందరు తమ అభిమాన టీమ్స్ కు ప్రత్యేక పూజలు చేయించారు. స్వయంగా గుడికి వెళ్లి కొందరు పూజలు చేశారు. ఎలాగైనా తమ ఫేవరెట్ టీమ్.. కప్ కొట్టాలని ఇష్టదైవాలను వేడుకున్నారు. 

ఐపీఎల్ టీమ్ అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ లలో ఒకటైన ఆర్సీబీ .. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవక పోవడంతో.. టీం ఫ్రాంఛైజ్.. ప్లేయర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా కసిగా ఉన్నారు. కప్ కొట్టాలనే కసి, పట్టుదల కోహ్లీకి ఎలా ఉందో.. ఫ్యాన్స్ కూడా అంతే కసితో.. కప్ కొడుతుందని తెగ వైరల్ చేస్తున్నారు. 

IPL 2025 సీజన్ కప్ ఆర్సీబీదేనని ఫ్యాన్స్ ఒక్కరే కాదు.. సీనియర్లు కూడా చాలా వరకు ఆర్సీబీకి ఓటేశారు. సెహ్వాగ్, అంబటి రాయుడు వంటి వెటరన్ క్రికెటర్స్ తో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా ఆర్సీబీ గెలుపు తథ్యం అని చెప్పేశాడు. వీళ్లే కాకుండా ఇంకా సీనియర్స్, సెలెబ్రిటీలు.. ఇలా దాదాపు చాలా వరకు అందరి సప్పోర్ట్ ఆర్సీబీవైపే ఉంది. 

దిష్టి తగలకుండా..

ఈ సాలా కప్ నమ్దే.. అంటూ మొదటి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్న ఫ్యాన్స్.. అందరి కళ్లూ తమ అభిమాన టీమ్ పైనే పడ్డాయని భావిస్తున్నారు. టీమ్ కు దిష్టి తగలకూడదని బెంగళూర్ లో కొందరు ఫ్యాన్స్ ‘యాంటీ నజర్ స్క్వాడ్’ (Anti Nazar Squad) అని టైటిల్ తో కారుకు నిమ్మకాయలు, మిరపకాయలతో అలంకరించారు. 

నిమ్మకాయలు, మిరకపాయలు కలిపి కడితే దిష్టి తగలదనే నమ్మకం ఇండియాలో బాగా ఉంటుంది. అందుకే.. ఈ సాలా కప్ నమ్దే.. అనే బోర్డు ఆర్సీబీ జెండా పెట్టి కారు మొత్తానికి నిమ్మకాయలు, మిరపకాయలతో దిష్టి తగలకుండా అలంకరించారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ పోస్ట్ ను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఆర్సీబీ పక్కా గెలుస్తుంది.. ఆర్సీబీ జీత్ జాయేగీ.. అంటూ ఫ్యాన్స్ ఫుల్లుగా కామెంట్స్ పెడుతున్నారు. దిష్టి ఉంటుందో ఉండదో మాట్లాడుకోవడం కంటే.. ఫ్యాన్స్ కు టీమ్ పై ఉన్న అభిమానం.. గెలవాలనే తపన ఎలా ఉందో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది.