తహసీల్దార్​ ఆఫీసు ఎదుట  కుటుంబం ఆందోళన 

తహసీల్దార్​ ఆఫీసు ఎదుట  కుటుంబం ఆందోళన 

సిద్దిపేట : కోహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన తమ భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని నిరసనకు దిగింది. గుళ్ళ బాలయ్య అనే వ్యక్తం 50ఏండ్ల క్రితం సాదా బైనామా ద్వారా 2 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అయితే అధికారులు దాన్ని అతని పేరుతో కాకుండా మరో వ్యక్తికి పట్టా చేశారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి తహశీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు.