26 లోపు నిర్ణయం తీసుకోకుంటే ఢిల్లీని ముట్టడిస్తాం

26 లోపు నిర్ణయం తీసుకోకుంటే ఢిల్లీని ముట్టడిస్తాం

నిరుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా మళ్లీ రైతు సంఘాలు నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇటీవలే సుప్రీం కోర్టు నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేయడం సరికాదంటూ రైతు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతు నిరసనల క్యాంపులను తొలగించారు. అయితే నవంబర్ 26 వరకు మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే మళ్లీ ఆందోళనలు చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) చీఫ్ రాకేశ్ తికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 26 కల్లా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆయన డెడ్‌లైన్ విధించారు. లేదంటే ఈ నెల 27న రైతులంతా గ్రామాల నుంచి ట్రాక్టర్లపై బయలుదేరి మరోసారి ఢిల్లీ  సరిహద్దులను ముట్టడిస్తారని చెప్పారు. దేశ రాజధాని చుట్టూ నాలుగు సరిహద్దుల్లోనూ మళ్లీ నిరసన క్యాంపుల్లోకి రైతులు చేరుకుంటారని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం..

నో డైలాగ్స్: సస్పెన్స్ తో వచ్చిన RRR టీజర్

బాలుడిపై లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్ 

ఇండియా సెమీస్‌‌ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి