రైతు నిరసనల ముగింపు.. 11న విక్టరీ మార్చ్

రైతు నిరసనల ముగింపు.. 11న విక్టరీ మార్చ్

మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం దాదాపు 15 నెలలుగా ఢిల్లీ బోర్డర్లలో ఆందోళన చేసిన రైతులు తమ సుదీర్ఘ నిరసనను విరమించారు. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యమంలో నమోదైన కేసులను వెంటనే ఎత్తేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ రైతులకు లెటర్ రాసింది. పరిహారం విషయంలో ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీంతో రైతులు తమ నిరసనలు విరమించారు. ఇన్నాళ్లుగా ఢిల్లీ బోర్డర్లలో నిరసనలు చేపట్టేందుకు ఏర్పాటు చేసుకున్న టెంట్లు తీసేస్తున్నారు.

అయితే ఇప్పటికిప్పుడు తాము ఢిల్లీ వదిలి పోవడంలేదని, ఈ నెల 11న ఢిల్లీలో విక్టరీ మార్చ్ నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అలాగే జనవరి 15న రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నేత గుర్నాం సింగ్‌ తెలిపారు. ఆ సమయానికి కేంద్రం ఇచ్చిన హామీల అమలులో తీసుకున్న చర్యలపై సమీక్షించి నిరసనలను పూర్తి స్థాయిలో విరమించడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ ప్రభుత్వం తమ హామీలన నిలుపుకోవడంలో విఫలమైతే మళ్లీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.