
కోహెడ, (హుస్నాబాద్) వెలుగు: భూ సమస్య పరిష్కారం చేయడం లేదని అక్కన్నపేట తహసీల్దార్ ఆఫీస్ఎదుట సోమవారం గౌరవెల్లికి చెందిన సంపత్ నిరసన తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తన తండ్రి పేరిట ఉన్న 491/8 సర్వే నంబర్లో 1.10 ఎకరాల భూమి కోల్పోయామన్నారు. తమకుపరిహారం ఇవ్వలేదని, మిగిలిన భూమి విషయంలో ఆఫీసర్లు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
గత ప్రభుత్వం తాను కోల్పోయిన భూమికి పరిహారం రాకుండా చేసిందని వాపోయాడు. స్థానిక మంత్రి అధికారులను ఆదేశించినా అధికారులు సమస్యను పరిష్కరించకుండా దాట వేస్తున్నరన్నాడు. అధికారులు సర్వే చేసి భూమి తనకు సంబంధించిందేనని నిర్ధారించి నెలలు గడుస్తున్నా సర్వే రిపోర్ట్ ఉన్నతాధికారులకు పంపించకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.