రైతు ముగజీవాల్ని ఎంతో ఆపాయ్యంగా చూసుకుంటాడు. వాటికి ఏదైనా అయితే ఇంట్లో సభ్యుడికే అయ్యిందన్నట్లుగా విల్లవిల్లాడిపోతాడు. అలా స్విట్జర్లాండ్ కు చెందిన ఓ రైతుకు ఆవు ఉంది. ఆల్ప్స్‌లోని ఓ పర్వతం వద్ద మేతకు వెళ్లిన ఆ ఆవు కాలుకి గాయమైనది. నొప్పితో కుంటుతూ నడుస్తోంది. దీనిని చూసిన ఆ రైతు చలించిపోయాడు. నడిపించి ఇంటికి తీసుకెళ్తే మరింత ప్రమాదం అవుతుందని..ఆవును ఇంటికి చేర్చేందుకు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్ సాయంతో పర్వతం నుంచి ఇంటికి చేర్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
